యూరియా యాప్ ను రద్దు చేయాలి జూలకంటి రంగారెడ్డి

యూరియా పై విధించిన యాప్ రద్దు చేయాలి

ఎరువులు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి

మిర్యాలగూడ టౌన్

యూరియా పై విధించిన యాప్ను రద్దుచేసి రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండేటట్లు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యూరియా యాప్ పై గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఆచరణలో పనిచేయకపోవడం హాస్యాస్పదమని,ఆ విధానం రైతులను ముంచడానికి ఉపయోగపడుతుందని వారన్నారు. యూరియాను పాత పద్ధతినే అమలు చేయాలని కోరారు. ఎరువుల ధరలను 1700 నుండి 2100 వరకు పెంచడం రైతును నష్ట నష్టపరచటమే అన్నారు. డి ఏ పి అందుబాటులో లేదని దీనికి తోడు కాంప్లెక్స్ ఎ రువులను ధరను మూడు నుండి నాలుగు వందల వరకు పెంచారని దీనివల్ల రైతుకు వ్యవసాయం చేయడం భారంగా మారిందని తెలిపారు. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వానాకాలం వ్యవసాయ సీజన్ సమీపిస్తున్న వానలు వచ్చే పరిస్థితులు కల్పించడం లేదని ఎండలు విపరీతంగా ఉన్నాయని దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళిక ప్రకటించాలని కోరారు. ఏ ప్రాంతంలో ఏ విధమైన పంటలు వేయాలో రైతులతో సమావేశాలు జరిపిఅవగాహన కల్పించాలని అందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాలను సందర్శించి ఆ మేర కు రైతులకుసలహా ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రభుత్వం సరైన వ్యవసాయ ప్రణాళికను సిద్ధం చేయకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని వారన్నారు. జీలుగు పెసర పచ్చ రొట్టె విత్తనాలు అందుబాటులో లేవని వాటిని అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుబంధు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కొత్త కొత్త స్కీములకు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించిన రైతులను విస్మరించడం విచారకరమన్నారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర సభ్యులు డబ్బికారు మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్ రాగిరెడ్డి మంగారెడ్డి వినోద్ నాయక్ పట్టణ కార్యదర్శి గౌతమ్ రెడ్డి లు పాల్గొన్నారు.

You May Have Missed