ఈనెల 10న నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిసీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి
మోడీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించండి
ప్రజాలహరి మిర్యాలగూడ;ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి తెలిపారు. స్థానిక ఫర్టిలైజర్ అడ్డ వద్ద ఫర్టిలైజర్ సిమెంట్ కార్మికులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుకూల విధానాలను అవలంబిస్తుందన్నారు. దానిని నిరసిస్తూ ఈనెల 10న నిర్వహించనున్న జైల్భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ శక్తుల మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గాయం వీరారెడ్డి,బజార్ హమాలీ యూనియన్ నాయకులు మచ్చ మల్లయ్య, కృష్ణ, బంటు వెంకన్న, బాబురావు, రమేష్ ,మల్లయ్య పాల్గొన్నారు.



