మిర్యాలగూడ పార్కింగ్ అడ్డాగా మారిన చర్చ్ రోడ్డు

ప్రజాలహరి మిర్యాలగూడ ;(హరిప్రసాద్ చీదళ్ళ) మిర్యాలగూడ పట్టణ నడిబొడ్డున ప్రజలకు నిత్యం అత్యవసరాల సమయంలో ఉపయోగపడే దారి అయిన చర్చి రోడ్డు రాఘవ టాకీస్ ముందు నుండి మొదలుకొని హనుమాన్ టెంపుల్ వరకు కలిగిన ప్రధాన రహదారి వెంట వాహనంలో నిలిపి ఉండడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న తంతు. కాగా ఈ విషయమై పత్రిక ముఖంగా అనేకమార్లు అధికారులకు తెలియపరిచినా ఏ ఒక్క అధికారి కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వకపోవడం, ఇట్టి విషయంలో ఇటువంటి మార్పు రాకపోవడం ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులు గాని పాదచారులు గాని ఈ సమస్య ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అని భయపడుతున్నారు. ఈ దారి వెంట అత్యవసర సమయంలో రావాలి అంటే వాహనాలు పార్కింగ్ చేసిన విధానం వల్ల ప్రాణాలు అరచేతిలో పట్టుకొని రావలసి వస్తుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసుల పరిధిలో ఉన్నప్పటికీ వారు ట్రాఫిక్ ని చూసి చూడనట్లు ఇటువంటి వాహన పార్కింగ్లను చూసి చూడనట్లు వదిలేస్తున్నాడు ప్రజల్లో మరింత భయాన్ని నింపుతుంది అదేవిధంగా సాగర్ రోడ్లో సైతం ఇటు ఫ్లైఓవర్ నుంచి రౌండ్ చౌరస్తా వరకు అనేక ప్రాంతాల్లో వాహనాలను సాఫీగా నడిపే పరిస్థితి లేకపోవడం మిర్యాలగూడ వ్యాపార ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతమైనప్పటికీ ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని ఇతర ప్రాంతాల నుండి పలువురు వ్యాపారస్తులు ప్రజలు రావడానికి అయిష్టతను వ్యక్తపరుస్తున్నారు. దేశంలో ఎన్నో వ్యాపార కేంద్రాలు ఉన్నప్పటికీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇటువంటి ట్రాఫిక్ సమస్యలే అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ తీసుకొని ట్రాఫిక్ ను నియంత్రించి సరియైన విధి నిర్వహణ చేస్తూ పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టవలసిందిగా పలువురు పాదచారులు వాహనదారులు కోరుతున్నారు.

Previous post

మిర్యాలగూడలో ఘనంగా జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసిన ప్రజాప్రతినిధులు

Next post

వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి: జూలకంటి రంగారెడ్డి యూరియా అందించాలి, యాప్ పునరుద్ధరించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల డిమాండ్

You May Have Missed