రానున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎన్నికలపై BRS ముఖ్య నాయకుల సమావేశం

ప్రజాలహరి హాలియా; హాలియా పట్టణంలో, పెద్దవూర మండల BRS పార్టీ ముఖ్య నాయకులతో నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు శ్రీ నోముల భగత్ కుమార్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…రానున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS పార్టీ ప్రతిష్టాత్మకంగా పోటీ చేస్తుందని, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.నవంబర్ 1,2026 నుండి అర్హత తేదీగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు జరుగుతోంది. నవంబర్ 6 లోపు ప్రతి గ్రాడ్యుయేట్ ను ఓటరుగా నమోదు చేయించే బాధ్యత కోఆర్డినేటర్లు తీసుకోవాలి.కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, రూ.4000 నిరుద్యోగ భృతి హామీలు నెరవేరలేదని, యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందని, దీన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని,బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో పెద్దవూర మండల BRS ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Previous post

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచిన మోడల్ స్కూల్ విద్యార్థులు

Next post

మిర్యాలగూడలో ఘనంగా జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్ విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసిన ప్రజాప్రతినిధులు

You May Have Missed