ప్రజాలహరి వార్తకు స్పందన జడ్చర్ల కోదాడ హైవే మరమతులకు శ్రీకారం

ప్రజాలహరి మిర్యాలగూడ( హరిప్రసాద్ చీదళ్ళ );ఈరోజు ఉదయం ప్రజాలహరిలో ప్రచురితమైన వార్తకు స్పందిస్తూ స్పీడ్ బ్రేకర్లు ,సిసి కెమెరాలు ఏర్పాటు చేసి..

జడ్చర్ల -కోదాడ హైవేపై వెంకటాద్రిపాలెంలోని జంకుతండాకు వెళ్లే క్రాస్ వద్ద సీసీ కెమెరాలు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారిస్తామని హైవే డిఇ బాలు, ఏఈ నవీన్ కుమార్,ప్రమాదాల నివారణ సీఐ అంజయ్య తెలిపారు. మంగళవారం ఇటీవల ప్రమాదం జరిగి మృత్యువాత పడిన ప్రదేశాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. భారీగా వాహనాలు క్రాస్ అవుతుండడం ప్రమాదాలు జరుగుతుండడం పరిశీలించామని తక్షణం నివారణ చర్యల కోసం స్పీడ్ బ్రేకర్లు ,సిగ్నల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు బిజెపి మండల కార్యదర్శి విజయ్ నాయక్, పకీర, కాలు,దినేష్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు

You May Have Missed