పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఓట్లు పెద్ద సంఖ్యలో నమోదు చేయించాలి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

*పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలి-మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు*

 

మిర్యాలగూడ: ప్రజాలహరి ….పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా మిర్యాలగూడ, దామరచర్ల, అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడుగులపల్లి మండలాలకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను ప్రతి గ్రామం, ప్రతి మండలంలో పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఓటరు నమోదు ప్రక్రియలో పట్టభద్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించేందుకు మిర్యాలగూడ రెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే ఇతర పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, అర్హత కలిగిన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా నాయకులు కృషి చేయాలని భాస్కర్ రావు సూచించారు.

 

ఈ సమావేశంలో *మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి,ఎండి.యూసుఫ్,చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి,ధనావత్ చిట్టిబాబు నాయక్,బైరం సంపత్,అంగోతు హతిరాం నాయక్,కుందూరు వీరకోటి రెడ్డి,జొన్నలగడ్డ రంగా రెడ్డి,ధనావత్ బాలాజీ నాయక్,కుర్ర సేవ్యా నాయక్,నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి,నంద్యాల శ్రీరాం రెడ్డి,కొత్త మరేడ్డి,ఒగ్గు జానయ్య,మజ్జిగపు సుధాకర్ రెడ్డి,ధీరావత్ పాచు నాయక్,రఫీ భాయ్,డశ్రు నుఅక్,కట్టా మల్లేష్ గౌడ్,లావూరి శ్రీను నాయక్,కుర్ర భీమా,ధనావత్ ప్రకాష్ నాయక్,మాలావత్ రవీందర్ నాయక్,రామావత్ వినోద్ నాయక్,చలికంటి యాదగిరి, ఆయా మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ఇన్‌చార్జ్‌లు* తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed