గ్రామీణ ప్రాంతాలకు షటిల్ బస్సులు నడిపించాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి..ఈరోజు మిర్యాలగూడ RTC బస్టాండ్ సందర్శించిన తెలంగాణ RTC మేనేజింగ్ డైరెక్టర్ *వై. నాగిరెడ్డి IPS గారిని* మర్యాదపూర్వకంగా కలిసిన మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి RTC బస్టాండ్ పరిసరాలను సందర్శించి సమస్యలను వారికి వివరించారు.. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మరియు రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
కావున క్రింది రూట్లలో ఉదయం మరియు సాయంత్రం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయవలసిందిగా
మాడుగులపల్లి మండలానికి సంబంధించి
మిర్యాలగూడ నుంచి కుక్కడం – తోపుచర్ల – ఇసుకబావిగూడెం – పుచ్చకాయలగూడెం – బొమ్మకల్ – భీమనపల్లి – కల్వలపాలెం – పాములపాడు – సూర్యాపేట రూట్‌లో ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించగలరని కోరారు..
అలాగే వేములపల్లి మండలానికి సంబంధించి
వేములపల్లి నుంచి అన్నపరెడ్డిగూడెం – గోగువారిగూడెం రూట్‌లో ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని..
ప్రస్తుతం వేములపల్లి – సల్కనూరు అడ్డరోడ్డు వరకు నడుస్తున్న బస్సును మంగాపురం వరకు పొడిగించాలని కోరారు..
అడవిదేవులపల్లి మండలానికి సంబంధించి
ముదిమాణిక్యం గ్రామానికి ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించగలరు…
ఈ ప్రాంతం గతంలో మరియు ప్రస్తుతం ప్రభుత్వ పలు పైలట్ ప్రాజెక్టులకు ఎంపికైనప్పటికీ సరైన రవాణా సౌకర్యం లేదని తెలియజేసారు….
మిర్యాలగూడ మండలానికి సంబంధించి మిర్యాలగూడ – యాదగిరిపల్లి – కాల్వపల్లి – ఉట్లపల్లి – తక్కెళ్లపాడు – తడకమళ్ళ – కామేపల్లి వరకు మరియు
మిర్యాలగూడ – రుద్రారం – లక్ష్మీపురం – ఎర్రకాలువ – కేశవపురం – రామోజీ తండా వరకు మరియు మిర్యాలగూడ – అవంతిపురం – ఆలగడప – రాయలపాలెం – ముల్కలకాల్వ – జాల్బాయి తండా వరకు మరియు
మిర్యాలగూడ – జప్తి వీరప్పగూడెం – జటావత్ తండా – అల్వాల్‌పాడు – బొర్రాయపాలెం – అన్నారం వరకు ఉదయం సాయంత్రం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయగలరు..
అలాగే దామచర్ల మండలం
దామచర్ల కేంద్రంగా
దామచర్ల – పొత్తలపాలెం – కల్లేపల్లి – గాంధీనగర్ – తిమ్మాపురం – తూర్పు తండా – బడాయిగడ్డ – రాగడప వరకు మరియు
దామచర్ల – గణేష్‌పాడు వరకు మరియు
దామచర్ల – నునావత్ తండా – సాతండా – తిట్టకుండా – మంగళదుబ్బ తండా వరకు
ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా వేలాది మంది గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు మరియు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కావున ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకొని పై రూట్లలో ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులు ప్రారంభించవలసిందిగా కోరుతూ లెటర్ అందజేయడం జరిగింది…
అలాగే మిర్యాలగూడ బస్టాండ్ ని డిజిటల్ బస్టాండ్ గా ఆధునికరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది..
సానుకూలంగా స్పందించిన ఎండీ గారు, పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసారు..
ఈ కార్యక్రమంలో RTC మిర్యాలగూడ డిపో మేనేజర్, RTC సిబ్బంది ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు..



