మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు (UDID) కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు (UDID) కేంద్రాన్ని. నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, IAS మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR సంయుక్తంగా ప్రారంభించారు… ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆసుపత్రిలోని యూడీఐడీ కేంద్రాన్ని పరిశీలించి, వైద్యాధికారులతో కేంద్రం పనితీరు, దివ్యాంగులకు అందించనున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు… అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో యూడీఐడీ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని, అర్హులైన ప్రతి దివ్యాంగుడికి వేగవంతంగా గుర్తింపు కార్డులు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు… ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ , మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి , DMHO, ఆసుపత్రి వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు…



