మిర్యాలగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ

ప్రజాలహరి మిర్యాలగూడ (హరి ప్రసాద్ చీదళ్ళ);మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ 7వ, 21వ వార్డులను సందర్శించి, శ్మశాన వాటికను సందర్శించి పరిశుభ్రత పనులను పరిశీలించారు. అలాగే రహదారులు, డ్రైనేజీలు, పారిశుధ్యం మరియు కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్-1 అధ్యక్షులు ఇంద్ర కుమార్ , టౌన్-2 అధ్యక్షులు మొయిజ్ , 21వ వార్డు ఇన్‌చార్జ్ కొమ్మన నాగలక్ష్మి , 7వ వార్డు ఇన్‌చార్జ్ పాతూరి ప్రసాద్ ,ఇతర కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

You May Have Missed