పిడపర్తి నాగరాజుకు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తాను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉద్యోగ సంఘ నాయకులు దశరథ నాయక్

నాగరాజుకు ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం… ఎమ్మెల్సీ శంకర్ నాయక్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ప్రాణాలు ఎదురొడ్డి వేగంగా వెళుతున్న రైలు ఎదురుగా వెళ్లి రెండు కాళ్లు చేయి పోగొట్టుకున్న పిడమర్తి నాగరాజుకు ఉద్యోగం ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని శాసనమండలి సభ్యులు కేతవత్ శంకర్ నాయక్ అన్నారు.గురువారం స్థానిక ఎన్ఎస్పి అతిథి గృహంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి ప్రాణాలతో బయటపడ్డ నాగరాజును ఆనాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానన్న హామీ అమలు పరచకపోవడంతో నాగరాజు కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నాగరాజుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తో పాటు సీఎం దృష్టికి తీసుకెళ్లి అయినా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో శాలువ, పూల దండ, ప్రశంస పత్రంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ రాజు,మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి,బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ నాయక్, ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బట్టు వెంకటేశ్వర్లు టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతికుమార్,మాల మహానాడు నాయకులు అభినవ్,నీలకంఠ నాయక్ జేఏసీ నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed