సకల జనుల పోరాటమే తెలంగాణ ఆవిర్భావం
సకల జనుల పోరాట ఫలితమే తెలంగాణ
మిర్యాలగూడ,
సకలజనుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని మంగళవారం ఉద్యమకారులను సన్మానించిన సందర్భంగా సామాజిక కార్యకర్త మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జర్నలిస్టు కొత్తపల్లి సైదులు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల పోరం తరుపున ఉద్యమకారులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా సామాజిక కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు జర్నలిస్టు కొత్తపల్లి సైదులు శాలువాతో సన్మానించి మెమొంటో బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉద్యమకారుల పురం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ రాష్ట్ర ఉద్యమకారుల ఎంపిక కమిటీ మెంబర్ శోభన్ రెడ్డి సామాజికవేత్త జాడి రాజు దశరథ తాళ్లపల్లి రవి, ధర్మపాల్ రెడ్డి లు పాల్గొని సుమారు 200 మంది తొలి,మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సత్కరించుకొని,అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉద్యమ తీరు తేన్నులను గురించి నెమరు వేసుకోవడం జరిగింది.



