ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయొద్దు…. సమ్మెకు మద్దతు ….అనే‌‌బోయిన మట్టయ్య

మిర్యాలగూడ ప్రజాలహరి….తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అన్నెబోయిన మట్టయ్య సంపూర్ణ మద్దతు తెలియజేశారు. మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక యూనియన్లు అన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి 32 డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు న్యాయబద్ధమైనవి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ హామీల అమలులో చిత్తశుద్ధి లేకపోవడం శోచనీయమన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు తన్నీరు పాండురంగయ్య, మిర్యాలగూడ డిపో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ సోమయ్య, ఆర్టీసీ కార్మికులు గాలం నాగయ్య, హాతీరాం తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed