తనకు అడ్డుగా ఉన్నారని ముగ్గురిని పెట్రోల్ పోసి తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించిన కసాయి వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

**తనకు అడ్డుగా ఉన్నారని ముగ్గురుని పెట్రోల్ పోసి తగలబెట్టిన కసాయి వ్యక్తి అరెస్టు….*
*అగ్నిప్రమాదoగా చిత్రీకరించే ప్రయత్నం…
*నా అనే వాళ్ళు లేకపోతే తన దరికి చేరుతుందని దురుద్దేశంతో ఈ ఘాతకానికి ఒడిగట్టిన మాజీ భర్త…. *బ్యాటరీ మ్యాట్రిమోనీతొ మహిళలజీవితాలతో ఆడుకుంటున్న కసాయి ప్రజాలహరి, మిర్యాలగూడ క్రైమ్ .
మిర్యాలగూడ పట్టణం కలాల్వాడలో ఈనెల 5న జరిగిన సిలిండర్ పేలుడు ప్రమాదం నిజంగా ప్రమాదం కాదని పక్కా ప్రణాళికతో జరిగిన హత్య గా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఛేదించారు
నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం వాసి శ్రీకాళహస్తి శిరీష్ కుమార్ మ్యాట్రిమోనీ ద్వారా మిర్యాలగూడకు చెందిన ధనమ్మ అనే మహిళతో రెండవ వివాహం2023లో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మిర్యాలగూడ కలాల్వాడాలో ధనమ్మ నివాసంలో ఆమె తల్లి చంద్రకళ 48, లక్ష్మణ్ 14, ప్రణతి 17, లను విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చనిపోయినట్లు చిత్రీకరించి ఒక పథకం ప్రకారం హత్య చేశాడు. బతుకుతెరువు కోసం పూణే వెళ్లిన ధనమ్మ తన తల్లి ,కుమార్తె, కుమారుడు చనిపోయిన విషయం తెలుసుకొని మిర్యాలగూడకు రావడంతో అసలు విషయం బయటపడింది.ఈ దారుణానికి ఒడికట్టిన సదరు హంతకుడు మ్యాట్రిమోనీ ద్వారా ధనమ్మ ను లోబరుచుకొని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. సదరు ధనమ్మ కు సంబంధించిన వివరాలను రాబట్టడం కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ధనమ్మ తెలిపిన వివరాల ప్రకారం హంతకుడు గురించి వాకబు చేయగా జైలు నుంచి విడుదలై ఈ ఘాతుకానికి ఒడికట్టినట్లు, మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన మరో ఇద్దరిని కూడా ఇదే విధంగా మోసం చేసి వివాహమాడినట్లు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశాల మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు విలేకరుల సమావేశంలోతెలిపారు. ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ హెచ్చరించారు.

You May Have Missed