మహిళా మెడలో బంగారు చేను దొంగలించిన నిందితుడు అరెస్టు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
బైకు దొంగతనం మరియు బంగారం పుస్తెలతాడు దొంగతనంలో నిందితుడు అరెస్టు రిమాండ్కు తరలింపు
జప్తి వీరప్ప గూడెం లో 73 సంవత్సరాల వయసుని లక్ష్మమ్మ ఆర్యవైశ్య వృద్ధురాలు మెడల నుండి దుండగులు పక్కా అన్నాగంపన్ని దొంగిలించడం జరిగింది పోలీసుల కథనం ప్రకారం హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామం నివాసి అయిన సు రోజు భార్గవ్ చారి పట్టాన్ అష్రప్ దండగల వినోద్ కుమార్ శివ నాగ మల్లికార్జునరావు లు వినోద్ కుమార్ వాళ్ళింటికి బంధువుల దిన కార్యక్రమాలకు వచ్చి ఇట్టి దొంగతనానికి పాల్పడినట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు ఇట్టి దొంగతనాన్ని ఒక నెల రోజులు పాటు రెక్కీ నిర్వహించి ఒంటరిగా ఉన్న వృద్ధురాలైన బైసిని లక్ష్మమ్మ 73 సంవత్సరాల ఆర్యవైశ్య వృద్ధురాలు ఒకతే ఉండడం గమనించి ఒక పథకం పన్ని అదును చూసి పథకాన్ని నలుగురు దుండగులు అమలు చేశారు. మద్యం దుకాణం నడుపుతున్న వృద్ధురాలు ఇంటికి వెళ్లి సదరు నలుగురు దుండగులు మద్యం సేవించి 500 రూపాయల నోటు ఇచ్చి చిల్లర కోసం ఇంట్లోకి వెళ్లిన వృద్ధురాలిని వెంబడించి వృద్ధురాలి మెడలో బంగారు పుస్తెలతాడును గుంజగా అరుస్తున్న ఆమెను మూతి పై గట్టిగా పట్టుకొని అరిస్తే చంపుతామని బెదిరిస్తూ అక్కడి నుంచి పారిపోయారని రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు ఇట్టి నలుగురు దుండగులను ఆలగడప టోల్గేట్ వద్ద పట్టుబడి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశాల మేరకు డిఎస్పి రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో రూరల్ సీఐ పీఎండి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు వారి సిబ్బంది సహకారంతో నేరస్తులను పట్టుకోవడం జరిగింది మరియు వారి నుండి బంగారు పుష్కలతాడు రెండు మోటార్ సైకిల్ 5 మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకోగా ఇట్టి నేరాలను ఉద్దేశించి డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మాట్లాడుతూ నేరాలు చేయాలంటే భయపడే స్థాయి కి నేరస్తులను తీసుకొస్తామని ప్రజలకు అభయమిస్తూ ఇటువంటి నేరాలను ఉల్లంఘించేది లేదని ఘాటుగా హెచ్చరించారు



