సుబ్బారావు సార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, విజయసింహారెడ్డి
మిర్యాలగూ ప్రజాలహరి
మిర్యాలగూడ టౌన్ శాంతినగర్ కు చెందిన మానవ హక్కుల వేదిక నాయకులు *శ్రీ. సుబ్బారావు గారి ఆకస్మిక మరణం పట్ల మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు మరియు తిప్పన విజయసింహ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు*.
ఈ సందర్భంగా వారు సుబ్బారావు గారి పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం సుబ్బారావు గారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో బలహీన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు.
సుబ్బారావు గారి మరణం మానవ హక్కుల ఉద్యమానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వారి వెంట *ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎండి.మగ్దుం పాషా, ఎండి.ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎండి.మాజీద్,పద్మశెట్టి కోటేశ్వర రావు, గుడిసె దుర్గా ప్రసాద్, గంగుల బిక్షం యాదవ్, దైద సత్యం, నల్లగంతుల నాగభూషణం, అరుణ్ కుమార్, వేనేపల్లి పాండురంగా రావు, నేరెళ్ళ శివ, కడియం సైదులు, ఖాదర్* తదితరులు ఉన్నారు.


