గ్రామపంచాయతీలో వేసే రహదారుల నిర్మాణాలలో నాణ్యతలు పాటించాలి…
(ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు విడుదలైన నిధులతో వేస్తున్న సిమెంట్ రోడ్లు నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. నిర్మాణంలోనే నాణ్యత ప్రమాణాలు డొల్ల బయటపడుతుంది.
దామరచర్ల మండలం మిట్టగూడెం నుండి దిలావరపురo మధ్య నిర్మిస్తున్న సిమెంటు రోడ్డు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేస్తున్నారు. రహదారుల నిర్మాణంలో ఇసుకకు బదులుగా ఎక్కువ శాతం కొత్తగా వచ్చిన డస్ట్ వాడకం జరుగు తుంది. డస్ట్ తో నిర్మించిన రహదారులు ప్రస్తుతం నాణ్యత ప్రమాణాలు ఉన్నట్టు కనిపించిన భవిష్యత్తులో తొందరగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్న వైనం ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవతీసుకొని నాణ్యత ప్రమాణాలను పాటించవలసిందిగా కోరుచున్నారు…………..సర్పంచ్ బెజ్జం సైదులు వివరణ…… రహదారి నిర్మాణం లో డస్ట్, ఇసుకలతొ రహదారి నిర్మాణం చేస్తున్నామని 100కు 100% రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాాటిిస్తున్నాామనిి విధంగా పర్యవేక్షణ చేస్తున్నామని దిలావర్ పురం సర్పంచ్ బెజ్జం సైదులు తెలిపారు.


