ఆస్తి కోసం తల్లి కూతుర్ని హత్య చేసిన కేసులో నిందితుల అరెస్టు

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

ఆస్తికోసం రక్తసంబంధికులను సైతం హతమార్చిన వైనం

భూవివాదాలు ఆస్తి పంపకాల విషయంలో ఏర్పడిన విభేదాల కారణంగా ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిన హత్య హాలియా మండలం ఇబ్రహీంపేట లో వెలుగు చూసింది

ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన రుద్రాక్ష సుమలత 45 మరియు ఆమె కుమార్తె రుద్రాక్ష లావణ్య కేసులో పోలీసులు సాధించిన పురోగతిలో భాగంగా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినారు.

రుద్రాక్షి సుమలత ఆమె కుమార్తె లావణ్యలు పామాయిల్ తోటకు పని నిమిత్తం వెళ్ళగా నిందితులు వారిని వెంబడించి ఒక కుదిరిన దాడి చేసి కళ్ళల్లో కారంపొడి చల్లి చున్నీతో గొంతు బిగించి హత్య చేసి పరారైన నిందితులను హాలియా పోలీసులు సాంకేతిక ఆధారాలు సెల్ఫోన్ వివరాలతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు నిందితుల నుండి ఒక మోటార్ సైకిల్ మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు హాలియా పోలీసులు తెలిపారు

నిందితులు నల్గొండ జిల్లా త్రిపురారం మండలం నిలయగూడెం నివాసితులు గుర్రం సునీత 37 యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డి బాయ్ గూడెం నివాసి గుండ్లపల్లి స్వామి 26 సంవత్సరాలు నల్గొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయిగూడెం నివాసి గుర్రం రమేష్ 40 సంవత్సరాలు అణువుల మండలం ఇబ్రహీంపేట గ్రామం నివాసి రుద్రాక్ష మహేష్ 32 సంవత్సరాలు ను అదుపులోకి తీసుకున్నట్లు మరియు పరారీలో ఉన్న నిందితులు నల్గొండ జిల్లా అణువుల మండలం నిమ్మల శశికళ నిమ్మల వెంకన్న రుద్రాక్ష నరసింహ లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గాలిస్తున్నట్లు నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు

గాలింపు చర్యలో భాగంగా నల్గొండ జిల్లా ఐపీఎస్ శరత్చంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు బి శ్రీను నాయక్ సీఐ నాగార్జునసాగర్ ప్రస్తుత హాలియా సర్కిల్ ఇంచార్జ్ గారి పర్యవేక్షణలో త్రిపురారం ఎస్సై కే నరేష్ హాలియా ఎస్ఐ బి సాయి ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కే కృష్ణ కోటి శివ ముని వెంకటేశ్వర్లు రమేష్ మరియు క్లూస్ టీం సభ్యుల సహకారం ప్రశంసనీయమని తెలిపారు ఆస్తి తగాదాలు ఉంటే పెద్దమనుషుల సమక్షంలో గానీ సామరస్యంగా చేసుకోలేని హత్యలకు పాలు పడితే ఉపేక్షించేది లేదని కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు

You May Have Missed