ఉచిత పెరుగన్నం పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ఈరోజు *BLR బ్రదర్స్* ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 వేల మందికి పంపిణీ చేసే *ఉచిత పెరుగన్నం పంపిణీ* కార్యక్రమం 7వ రోజు ప్రారంభించిన
మిర్యాలగూడ, ప్రజాలహరి
శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి* వారి తనయులు యువ నాయకులు *బత్తుల సాయి ప్రసన్న.* పెరుగన్నం పంపిణీ చేసారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి విచ్చేసే ప్రజలకు,రైతులకు, ఉపసమనం కోసం రోజు దాదాపు 3 వేల మందికి పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు..
ఈ కార్యక్రమం జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది అని అన్నారు.. ఏరియా ఆసుపత్రి మరియు మున్సిపల్ కాంప్లెక్స్ నందు పంపిణీ జరుగుతుంది అన్నారు..
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బంటు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దేశిడి శేఖర్ రెడ్డి గారు, తలకొప్పుల సైదులు , గడ్డం పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..


