రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హరీష్ రావు కు వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు బిఆర్ఎస్ నేతలు
*కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు మరియు మిర్యాలగూడ రైతు నాయకులు & బీ ఆర్ ఎస్ నాయకులు*…
మిర్యాలగూడ ప్రజాలహరి
రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, రైతులు ఎదుర్కుంటున్న తీవ్రమైన సమస్యలపై మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు, రైతు నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారిని హాలియా BRS ఆఫీస్ లో కలిశారు.
ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో సాగునీటి సరఫరాలో జాప్యం, ఎరువులు మరియు విత్తనాల అందుబాటులో సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడం, మరియు పెండింగ్‌లో ఉన్న రైతు సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, రైతుల సంక్షేమం కోసం తక్షణ చర్యలు చేపట%


