మిర్యాలగూడ పట్టణంలో ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ తో రాకపోకలకు ఇబ్బంది
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైం
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సాక్షిగా నిత్యం రద్దీగా ఉండే మిర్యాలగూడ ప్రధాన కూడలిలో రహదారి వెంట వాహన పార్కింగ్ పాదచారులను సైతం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పట్టించుకున్న నాధుడి లేకపోవడం ప్రజల్లో భయాందోళన ఉదృతమవుతుంది. రోడ్లు వెడల్పు కార్యక్రమం లో భాగంగా ఎంత వెడల్పు చేసిన పార్కింగ్ దృష్ట్యా ట్రాఫిక్ పెరుగుతుందే కానీ నిలకడగా కనీసం ఉండటం లేదు ఈ విషయంలో పట్టణ వాహనదారులు మరియు పాదజారులు అనేక రకాలైన ఇబ్బందులకు లోనవుతున్నారు
అత్యవసర పరిస్థితిలో మిర్యాలగూడ ప్రధాన రహదారుల వెంట ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి. మిర్యాలగూడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నదా లేదా అనే చందాన ట్రాఫిక్ పోలీసుల తీరు ఉన్నదని ప్రజలు భయాందోళన కు గురి అవుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు మేల్కొని సాగర్ రోడ్డు, చర్చి రోడ్డు, టాకా రోడ్డు, మరియు ఖమ్మం రోడ్డు సబ్ కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా వంటి రద్దీప్రాంతాలలో గట్టి నిఘాను ఉంచి ట్రాఫిక్ ను నియంత్రించవలసిందిగా పలువురు ప్రజలు విన్నవించుకుంటున్నారు


