అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ కేసు నమోదు
తడకమళ్ళ గ్రామ శివారులోని మోసి నది నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు మిర్యాలగూడ రూరల్ పోలీసులు పెట్రోలింగ్లో భాగంగా తనిఖీ కి వెళ్ళగా ఎదురుగా వస్తున్న రెండు ట్రాక్టర్లు మరియు ట్రాలీలు నిండుగా ఇసుకను నింపుకొని వెళుతున్న క్రమంలో డ్రైవర్లను ప్రశ్నించగా మొదటి ట్రాక్టర్ యొక్క డ్రైవరు మరియు ఓనర్ సిలువేరు ఆదినారాయణ రెడ్డి తండ్రి జానయ్య మరొక ట్రాక్టర్ డ్రైవర్ అల్వాల నాగరాజు తండ్రి మురారి గా నిర్ధారించడం అయినది ఇట్టి ట్రాక్టర్లను మరియు ట్రాలీలను మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని ట్రాక్టర్ ఓనర్లపై మరియు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్సై తెలిపారు
ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రూరల్ పోలీసులు మరియు ఎస్సై తీవ్రంగా హెచ్చరించారు.

