పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి..ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్* కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా పట్టణంలోని పలు వార్డులలో మరియు పలు గ్రామాలలో వార్డ్ సభలు, గ్రామ సభలలో పాల్గొన్న..శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్ , డీఎస్పీ *రాజశేఖర్ రాజు .. ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా MLA – మాట్లాడుతూ..
ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా రెండున్నర సంవత్సరాలలో మన మిర్యాలగూడ నియోజకవర్గంలో *3500 ఇందిరమ్మ* ఇళ్లను నిర్మించి పేద కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చాము అని అన్నారు..
అతిత్వరలోనే మిర్యాలగూడ పట్టణంలో కూడా *2500 ఇళ్లకు* శ్రీకారం చుట్టబోతున్నాము అని అన్నారు..
గత ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి కమిషన్ ల కోసం రాష్టాన్ని అప్పుల కుప్పగా చేసింది అని అన్నారు.. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు లాంటి అనేక సంక్షేమాలను పేద ప్రజలకు అందించి వారి అందరి ఆశీస్సులతో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి నిరాజనాలు పలికి అధిక స్థానాల్లో ఆశీర్వధించారు అని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..



