బుద్ధునితో నా ప్రయాణం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాటకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి.
మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్ర భారతి నందు జన విజ్ఞాన వేదిక మరియు అంబేద్కరైట్ ప్రజా వైద్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన
అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి *బుద్ధుని తో నా ప్రయాణం డా,, బి ఆర్ అంబేద్కర్* తెలుగు నాటక ప్రదర్శనలో పాల్గొన్న
మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*,
MLC *శంకర్ నాయక్ గార్లు*..
అంబేద్కర్,మరియు బుద్ధుడి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నాటకాన్ని ప్రారంభించారు..
ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ..
గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి బోధించిన శాంతి మార్గంలో మన భారత రాజ్యాంగ నిర్మాత డా,, బి ఆర్ అంబేద్కర్ గారు ఎలా ప్రభావితులు అయ్యారు..
ఎలా వారి మార్గన్ని, వారి సిద్ధాంతాలను అనుసరించారు అనే అంశాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా ఇలాంటి అద్భుత నాటకాలు ప్రదర్శింస్తున్న అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారికి అభినందనలు తెలియజేసారు…
అలాగే ప్రతిఒక్కరం బుద్ధుడు సూచించిన శాంతి మార్గంలో ప్రయాణం చేస్తూ ప్రతీ ఒక్క సమస్యను, ప్రతీ పరిస్థితులను ప్రేమతో జయించడం తెలుసుకోవాలి అని అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు చిలుకూరి బాలకృష్ణ గారు, గుడిపాటి నవీన్ గారు, దేశిడి శేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకుడు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..



