వేములపల్లి లో రోడ్ ఎక్కిన రైతన్నలు
యూరియా కోసం రోడ్డు ఎక్కిన రైతన్నలు
వేములపల్లి( ప్రజాలహరి ) నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో స్థానిక పిఎసిఎస్ బ్యాంకు పరిధి లో యూరియా కోసం శనివారం నార్కట్పల్లి అద్దంకి రహదారిపై రోడ్డు ఎక్కిన రైతన్నలు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యూరియా ఆన్లైన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని పలువు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలకు స్మార్ట్ ఫోన్ లేక వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని వారు ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అందరి రైతులకు యూరియాను అందుబాటులో ఉండే విధంగా చూడాలని పలువురు రైతులకు కోరారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు ఎస్ఐ డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పలు రైతులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు.



