తెలంగా సాయుధ పోరాట యోధుడు శ్రీనివాసరెడ్డి నేటి యువతరానికి ఆదర్శప్రాయుడు
నాటి పోరాట వీరుల చరిత్ర నేటి యువతకు ఆదర్శం
మిర్యాలగూడ ప్రజాలహరి
భూమికోసం గుత్తి కోసం మానవాళి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొన్న నాయకుల జీవితం ఆదర్శనీయమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డభికార మల్లేష్ తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ శాసనసభ్యులు నంద్యాల శ్రీనివాస్ రెడ్డి ఏడవ వర్ధంతి జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి గ్రామ రాజ్యాల ఏర్పాటుకు కారణమైన నా టీ పోరాటం చిరస్మరణీయమైందన్నారు ఆ పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శం కావాలని వారు అనుసరించి మార్గం మరువలేనిదని వారన్నారు. నేడు పాలకుల అనుసరిస్తున్న దివాలా కోరు విధానాలపై పోరాటం కొనసాగించాలని అందుకు ప్రజలు సమాయత్తం కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మాయ మాటలు చెప్పి కాలం వెళుతుంది తప్ప ప్రజా ఉపయోగకరమైన పనులు ఏమీ చేయలేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు మంగారెడ్డి రవి నాయక్, పాదురి శశిదర్ రెడ్డి,రెమడాల పరుశురాం,అదేవిధంగా నంద్యాల కృపాకర్ రెడ్డి నంద్యాల వేణుధర్ రెడ్డి సిఐటియు నాయకులు తిరుపతి రామ్మూర్తి,రామకృష్ణ ,కోడిరెక్క మల్లయ్య, ఆశీర్వాదం, రామచంద్రు, కోటిరెడ్డి,రామారావు,కరీం, సైదులు,ఏఎస్ రావు తదితరులు పాల్గొన్నారు



