గుడుగుంట్ల ప్రసాద్ రోడ్డు ప్రమాద మృతి పట్ల మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి!

గుడుగుంట్ల ప్రసాద్ రోడ్డు ప్రమాద మృతి పట్ల మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి!

 

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైం: మిర్యాలగూడ పట్టణం బాపూజీ నగర్‌కు చెందిన గుడుగుంట్ల ప్రసాద్ వెంకటాద్రిపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం పట్ల మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేశారు. లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం పాలుకావడం తనను ఎంతగానో కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన మాజీ ఎమ్మెల్యే, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుడు గుడుగుంట్ల ప్రసాద్ భౌతికకాయాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రసాద్ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.   అదేవిధంగా, ఈ ప్రమాదంలో బైక్‌పై ఉండి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులను నల్లమోతు భాస్కర్‌రావు గారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన, అత్యవసర వైద్యం అందించాలని, అవసరమైతే ఉన్నత చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బందిని ఆదేశించారు.  వారి వెంట పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ మొండి కత్తి లింగయ్య పేరుమల్ల ధనమ్మ దోరేపల్లి లింగయ్య ఏడుకొండలు సత్యనారాయణ మల్లేష్ తదితరులు ఉన్నారు..

Previous post

మిర్యాలగూడ నియోజకవర్గం లోని పలు మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం

Next post

మిర్యాలగూడలో 24 గంటల తాగునీటి లక్ష్యంతో అమృత్ 2.0 పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

You May Have Missed