మిర్యాలగూడలో 24 గంటల తాగునీటి లక్ష్యంతో అమృత్ 2.0 పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

మిర్యాలగూడలో 24 గంటల తాగునీటి లక్ష్యంతో అమృత్ 2.0 పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

 

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, ప్రతి ఇంటికి 24 గంటల పాటు నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేస్తున్న అమృత్ స్కీమ్ 2.0 పనులను. మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి -BLR   క్షేత్రస్థాయిలో పరిశీలించారు… ఈ సందర్భంగా పెద్ద దేవులపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద నిర్మిస్తున్న *నూతన పంప్ హౌస్* మరియు  నూతన పైప్‌లైన్ నిర్మాణ పనులను  పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు… నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులోపు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు… అనంతరం మిర్యాలగూడ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న  12 నూతన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల  పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, పట్టణ ప్రజలకు నిరంతరాయంగా  24 గంటల తాగునీటి సరఫరా  అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణంలో తాగునీటి సమస్య గతంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు… అమృత్ 2.0 పథకం పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు నాణ్యమైన, నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ SC వెంకటేశ్వర్లు గారు, ఇతర అధికారులు, కాంట్రాక్టర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

Previous post

గుడుగుంట్ల ప్రసాద్ రోడ్డు ప్రమాద మృతి పట్ల మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి!

Next post

సామెగాని తండాలో తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు

You May Have Missed