మిర్యాలగూడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్దే.. అనుకున్నది సాధించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
⭐ మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా..
⭐అనుకున్న సాధించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ ప్రజాలహరి) మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూపింది 48 వార్డులకు గాను 31 వార్డులలో కాంగ్రెస్ విజయతన0 ఎగరవేసింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల 20 రోజులు ముందు నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆచితూచి సర్వే ఆధారంగా టికెట్లు కేటాయించుకుంటూ వచ్చినారు కొంతమంది ఎదురు తిరిగిన వారిని వారి అంచనాలను తలకిందులు చేస్తూ గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చారు. ఆయన మాటే నిజమైంది. 31 వార్డులో గెలుపుతో వన్ మ్యాన్ షో గా లక్ష్మారెడ్డి నిలిచాడు. లక్ష్మారెడ్డి అంచనా ప్రకారం ఇంకొక ఐదు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కొద్దిపాటి మెజార్టీలతో కొన్ని సీట్లు కోల్పోయారు. గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకరు కాంగ్రెస్ మద్దతు దారుడే దీంతో మొత్తం 32 స్థానాలు కాంగ్రెస్ వే 16వ తారీఖున లాంచనంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక తరవాయి . ఎన్నిక కు ఎటువంటి ఆలోచనలు లేవు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానికంగా పట్టు సాధించి , రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి దగ్గర ప్రత్యేకమైన గుర్తింపు లభించుకునేలా ఈ ఎన్నికల వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది…
🔔చైర్మన్- వైస్ చైర్మన్ ఎవరు అనేది 16వ తారీకు వరకు ఓపిక పట్టాల్సిందే… భక్తుడి కోరికలు ఏమిటో భగవంతునికే తెలుసు.. అదే విధంగా ఎవరు చైర్మన్ అనేది ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికే తెలియాలి. నర మానవుడికి తెలియదు.



