రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ;జూలకంటి
పరస్పర ఆరోపణలు తప్ప అభివృద్ధి శూన్యం
రేవంత్ రెడ్డి సర్కార్ పై జూలకంటి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి ఆవగింజంత జరగకుండా పరస్పర ఆరోపణలు తప్ప అభివృద్ధి శూన్యంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి విమర్శించారు. మంగళవారం నాడు కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పలపాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిపై బ్రమలు కల్పిస్తున్నారు తప్ప వారి కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ సైతం ఇదే బాటలో నడుస్తుందని అధికారం చేపట్టి 12 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలిపారు. ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును గమనిస్తున్నారని సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తారని వారు చెప్పారు. ప్రపంచం ఎర్రజెండా అవసరాన్ని గుర్తిస్తున్నాయని అందుకు ప్రపంచవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడు సైతం ఒక సభలో మాట్లాడుతూ ప్రపంచానికి ఎర్రజెండా ప్రమాదం ఉందని పెట్టుబడిదారీ దేశాల్లో సైతం కమ్యూనిస్టుల ప్రభావం ఉందన్నారు. ఉదయం పూట జరిగిన రాజకీయ శిక్షణ తరగతిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బండారు రవికుమార్ మతోన్మాదం ప్రతిఘటన అనే అంశంపై వివరంగా విషయాలు వివరించారు. మధ్యాహ్నం జరిగిన తరగతులు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్ పార్టీ కార్యక్రమం పైన తరగతులు బోధించారు. శిక్షణ తరగతులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు తరగతులకు సిపిఎం జిల్లా కమిటీ రవి నాయక్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.



