కరీంనగర్ బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ వేశం

ప్రజాలహరి మిర్యాలగూడ ; (హరిప్రసాద్ చీదళ్ళ)బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఏర్పాటు చేసినటువంటి గీత భవన్ చౌరస్తా వద్ద ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశంను BSS రాష్ట్ర అధ్యక్షులు మరియు న్యాయవాది జనగామ నర్సింగ్ అన్నా మరియు kvps రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది తిప్పరపు సురేష్ మరియు TJS రాష్ట్ర అధ్యక్షులు కుత్తాడి శివరాజ్ ప్రారంభించడం జరిగింది. … పలు అంశాల పైన చర్చించడం జరిగింది.. చర్చలో భాగంగా అనిల్ యాదవ్ మాట్లాడుతూ..‌

GO 9, GO 97పై విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని.

విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి

కరీంనగర్, తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన GO Ms. No. 9, GO Ms. No. 97 అంశాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు… వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు…

GO 97 ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)తో అనుసంధానం చేసే అంశంపై విద్యార్థుల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తు, SBTET పరిధి, ECET ద్వారా B.Tech లేటరల్ ఎంట్రీ, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

అదేవిధంగా GO Ms. No. 9లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను DBT విధానం రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యా విధానాల్లో మార్పులు తీసుకువచ్చే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో సంప్రదింపులు జరపాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్

చేశారు.

ఈ సమావేశంలో జిల్లా న్యాయవాది. శ్రీధర్ జిల్లా కార్యదర్శి నరేష్ యాదవ్ .. pdsu రాష్ట్ర కోశాధికారి అంగడి కుమార్ AIFDS ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్.. తెలంగాణ అంబేద్కర్ విద్యార్థి విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అజయ్.. TLSA జిల్లా అధ్యక్షులు వినీత్.. .. బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ప్రణీత్.. కన్వీనర్ సాయి యాదవ్…. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్… జిల్లా లైబ్రరీ.. అధ్యక్షులు సురేష్.. గంగాధర మండల ఇన్చార్జ్. అంజి మోడల్.. తదితరులు పాల్గొనడం జరిగింది….

విద్యార్థుల సమస్యల పరిష్కరించకపోతే భవిష్యత్తులో విద్యార్థి ఉద్యమ గళాన్ని చేపడతామని సందర్భంగా తెలియజేయడం జరిగింది.

You May Have Missed