నందిపాడు బైపాస్ వద్ద జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్; నందిపాడు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు. నందిపాడు బైపాస్ వద్ద జరిగిన విషాదకర లారీ–బైక్ ప్రమాదంలో కమిలి గారు దురదృష్టవశాత్తు మృతి చెందగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఏఅనంతరం వర్షిత హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మృతురాలి భర్తను ఎమ్మెల్సీ గారు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రమాద బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్సీ శ్రీ కేతావత్ శంకర్ నాయక్ గారు సూచించారు.



