హట్య తండాలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

**హట్యా తండాలో పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR**

 

ప్రజాలహరి మిర్యాలగూడ ;మిర్యాలగూడ మండలంలోని హాట్యా తండా గ్రామంలో** పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ మాంస పశు పరిశోధనా సంస్థ (Under DAPST)  సహకారంతో నిర్వహించిన  ఉచిత పశువైద్య శిబిరాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు** ప్రారంభించారు…

ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు మరియు పశుపాలకుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు…

 

పాడి పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు…

 

గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు…

శిబిరంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు, టీకాలు, మందులు ఉచితంగా అందించడంతో పాటు పశుపోషణ, వ్యాధి నివారణ, శాస్త్రీయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు…

ఈ కార్యక్రమంలో MLC *శంకర్ నాయక్ గారు,* పశుసంవర్ధక శాఖ అధికారులు, జాతీయ మాంస పశు పరిశోధనా సంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు…

You May Have Missed