రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్

ప్రజాలహరి మిర్యాలగూడ;ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం (Live) చేయగా, మిర్యాలగూడ మండలం లోని కొత్తగూడెం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి (MAO) రుషేంద్రమని ఆధ్వర్యంలో సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రైతు భరోసా పథకం ద్వారా రైతులకు అందిస్తున్న వ్యవసాయ అభివృద్ధి గురించి వివరించారు, ఈ కార్యక్రమం లో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు,ఉద్యాన అధికారి నసీమా (HO), AEOs పార్వతి, నాగయ్య , కడియం ఇజ్రాయెల్, k. జగన్,రైతులు పాల్గొన్నారు

You May Have Missed