రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే బిఎల్ఆర్

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR**

ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన **రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో**

మిర్యాలగూడ శాసనసభ్యులు **బత్తుల లక్ష్మారెడ్డి -BLR** గారు రైతులతో కలిసి పాల్గొన్నారు…

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి **శ్రీ ఏ. రేవంత్ రెడ్డి** గారి ఆధ్వర్యంలో నిర్వహించిన **రైతు భరోసా సదస్సు** కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు…

ఈ సందర్భంగా MLA -BLR గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని రైతుల అభ్యున్నతికి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు…

ఇప్పటికే **నేడు రైతుల ఖాతాల్లో జమ చేసిన రైతు భరోసా నిధులతో పాటు, ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందజేస్తున్నామని** తెలిపారు…

అలాగే రాష్ట్రవ్యాప్తంగా **73.32 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించామని**, **కౌలు రైతుల కోసం రూ.9 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని** పేర్కొన్నారు…

అంతేకాకుండా, **తొలి విడతలోనే 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు పక్షపాత విధానానికి నిదర్శనమని** అన్నారు…

రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు..

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు బంధు సమితి సభ్యులు, రైతులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు….

You May Have Missed