రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ ;ఈ రోజు (28.06.2026) హాలియా పోలీస్ స్టేషన్‌లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన నల్ల రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోడ్డు ప్రమాద మరణానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

బంధువులఫిర్యాదు ప్రకారం, మృతుడు నాళ్ళ సుధీర్ (46) ఈ రోజు మధ్యాహ్నం తన మోటార్ సైకిల్ నెం. AP24AC4933 పై వివాహ ఆహ్వాన పత్రికలు పంపిణీ చేయుటకు మిర్యాలగూడ నుండి హాలియా వైపు బయలుదేరాడు. అనంతరం మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో అతని మొబైల్ ఫోన్ నుండి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి రోడ్డు ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సుధీర్‌ను ట్రాలీ ఆటోలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నల్గొండకు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై మృతుడి తనకు తానే రోడ్డు ప్రమాదం వల్ల జరిగిందా లేదా గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల జరిగిందా అనే కోణంలో అన్ని అంశాలను సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నాము. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అందుబాటులో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని

ఈ కేసులో వాస్తవాలను వెలికితీసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హాలియా ఎస్‌ఐ బి. సాయి ప్రశాంత్ తెలిపారు.

You May Have Missed