ఇటుక బట్టీలు వారు వచ్చే దుమ్ము వల్ల ప్రజలు ఇబ్బంది పడొద్దు… కలెక్టర్

 

మిర్యాలగూడ ప్రజాలహరి

ఇటుక బట్టీల వల్ల దుమ్ము, ధూళి తో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు.

ఇటుక బట్టీల వల్ల ప్రజల ఆరోగ్యం, భద్రతకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.

 

మిర్యాలగూడ పట్టణంలో ఇటుక బట్టీల వల్ల దుమ్ము, ధూళి సమస్య తీవ్రంగా ఉందని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రజల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ఆకస్మికంగా ఇటుక బట్టీలను తనిఖీ చేశారు.

 

ఈ సందర్బంగా కలెక్టర్ ఇటుక బట్టీ యజమానులతో మాట్లాడుతూ తగిన లైసెన్స్ ఉందా ? అని అడిగారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించడం సహించమని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తహసిల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సంబంధిత అధికారులు ఉన్నారు.

Previous post

రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి మిల్లర్లకు ఆదేశాలు చేసిన కలెక్టర్

Next post

ఈ నెలాఖరు లోపు డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయాలి ..కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాలు

You May Have Missed