రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి మిల్లర్లకు ఆదేశాలు చేసిన కలెక్టర్

 

 

@ రైతులకు ఇబ్బంది లేకుండా మద్దతు ధర ఇవ్వాలి జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్.

మిర్యాలగూడ ప్రజాలహరి     జిల్లాలో రైతులు అమ్మే ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రైస్ మిల్లు ఓనర్లను ఆదేశించారు.

 

సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని మహా తేజ రైస్ మిల్లును

ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా గన్ని బ్యాగుల నిల్వ గదులను బియ్యం నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే దిగుమతి చేసుకుని, కొనుగోలు చేయాలని మిల్లర్లకు చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మిల్లర్లు అందరూ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కోరారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం రెండు నుండి మూడు రైస్ మిల్లులను అనుసంధానం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

ఈ సీజన్ ముగిసే వరకు మిల్లర్లు కలిసికట్టుగా పనిచేసి, ధాన్యం కొనుగోలు వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన తెలిపారు.

 

రెవిన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, డిఎం రామ్ పతి నాయక్, రైస్ మిల్లర్స్ బండారు కుశలయ్య, గౌరు శ్రీనివాస్ శ్రీరామ్, బాబి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారూ*

You May Have Missed