అవంతిపురంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి: ఈరోజు మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో *నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు* పనులను శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు….

 

ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అనునిత్యం పల్లెల ప్రగతికి కృషిచేస్తూ గ్రామాలలో కావాల్సిన మౌలిక వసతులు సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, నూతన గ్రామ పంచాయతీ భవనాలను నిర్మిస్తున్నాము అని అన్నారు….

 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ *వల్దాస్ సుజాత సురేష్ గారు*.. కార్యదర్శి, వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు…,….

..

*ప్రజా పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరడం శుభపరిణామం*

 

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వార్డ్ మెంబర్లు

ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి* సమక్షంలో చేరికలు..

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన కు ఆకర్షితులై స్వచ్ఛందంగా పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభపరిణామమని కలిసికట్టుగా మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి-BLR గారు అన్నారు…

 

మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ పార్టీ లో ఆయన సమక్షంలో చేరారు…

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు…

 

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామంలోని *మూడవ వార్డు మెంబర్ చెలిమెల కవిత, నాలుగో వార్డ్ మెంబర్ మోతే వెంకటయ్య లు* బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమన్నారు…

 

సర్పంచ్ వల్దాసు సుజాత సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

You May Have Missed