ఆసక్తి పెంపొందిస్తున్న పద్య నాటికలు
పద్య నాటిక…సాంఘిక నాటికలు మూడవరోజు:
మిర్యాలగూడ ప్రజాలహరి

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న నందినీ అవార్డ్స్ 2026 జాతీయస్థాయి పద్య నాటక సాంఘిక నాటక పోటీలు మరియు నృత్యోత్సవాలు మూడవ రోజు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రంగా రవికుమార్ రంగా శ్రీధర్ లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో పద్యనాటిక, సాంఘిక నాటికలకు మన మిర్యాలగూడకు గొప్ప పేరు ప్రతిష్టలు అందించిన.. అందిస్తున్న తడకమళ్ళ రామచంద్రరావు, పులి కృష్ణమూర్తి శర్మ, కీర్తిశేషులు పులి శేషయ్య వంటి పెద్దలకు ధన్యవాదాలు. వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఈ కలలను నేటి తరానికి అందించాలంటే వారు ఇచ్చే సూచనలు సలహాలు తప్పక ప్రతి ఒక్కరూ అనుసరించాలి. తాము వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నా ఈనాటికలు వల్ల కలిగే ఆనందం వర్ణనాతీతమన్నారు. ఈ నాటికలలో నటించే అదృష్టం మాకు లేకపోయిన నిర్వాహకులకు మీ మించి మేము ఇచ్చే సహాయం చాలా చిన్నది. నాటికల అనంతరం నటీనటులకు.. నిర్వాహకులకు పారితోషకంతో పాటు షీల్డ్లు ప్రశంసా పత్రాలను అందజేశారు.
బుధవారం రోజున ప్రదర్శించిన సాంఘిక నాటికలు పద్య నాటికలు
1) “త్యాగశీలి దధీచి మహర్షి” పద్య నాటకం టి.బి.ఆర్. ఆర్ట్స్, హైద్రాబాద్
2) “భక్త ప్రహ్లాద” పద్య నాటిక నవకాంత్రి కల్చరల్ అసోసియేషన్, హైద్రాబాద్
3) “ఉరి” సాంఘిక నాటిక వెలగలేరు థియోటర్ ఆర్ట్స్, వెలగలేరు.
4) “వేదాంతం” సాంఘిక నాటిక శ్రీ షిర్డిసాయి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్, అనకాపల్లి
5) “తితీక్ష” సాంఘిక నాటిక బి.వి.కె. క్రియేషన్స్, కాకినాడ.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు,అధ్యక్షులు రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి వెంకటలక్ష్మీనారాయణ శర్మ, సాయిలు, సత్యనారాయణ చారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శ్రీమతి శైలజ, సరస్వతి, శ్రీమతి నాగమణి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, టంగుటూరి రాజారాం తదితరులు పాల్గొన్నారు.



