మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, విజయ్ సింహ రెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

నల్లబోతు భాస్కరరావు

వేములపల్లి( ప్రజాలహరి ) ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన్న విజయసింహారెడ్డిలు కొనియాడారు. ఆదివారం వేములపల్లి మండలం లోని శెట్టిపాలెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మహిళలకు ఉన్నటువంటి గౌరవం నేడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తండాలను సైతం ప్రత్యేక గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయడం వలన మహిళలకు చట్టసభలో కూర్చునే అవకాశాలు ఎక్కువగా వచ్చాయని ఆయన కొనియాడారు. ముఖ్యంగా మహిళలు అంటే ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క వివిధ రకాలుగా మహిళలు చేసే సేవలను మనము గుర్తించలేవని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏది ఏమైనా అప్పటికిని మహిళలు ఒక దేవత తో సమానం ఆయన కొనియాడారు. ఇట్టి కార్యక్రమానికి మాజీ సర్పంచ్ మజ్జిగ పద్మ అధ్యక్షత వహించారు. అంతేకాకుండా శెట్టిపాలెం గ్రామంలో ఉన్నటువంటి గ్రామపంచాయతీ సిబ్బందికి మొదలుకొని ఓ మహిళ ఎస్సై స్థానం వరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నటువంటి వివిధ రకాల సిబ్బందిని శాలువాలతో సత్కరించి మేముంటోళ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెదమం సైదులు. టిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్, మజ్జిగ సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ నక్క శేఖర్, గౌరు శ్రీనివాస్, కాట్రగడ్డ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు

You May Have Missed