ఈనెల 9 నుంచి 15 వరకు జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటిక , నృత్య ప్రదర్శనలు.. తడక మళ్ల రామచంద్ర రావు, కృష్ణమూర్తి
మిర్యాలగూడలో ఈనెల 9 నుండి జాతీయస్థాయి పద్య నాటక,సాంఘిక నాటిక పోటీలు….
మిర్యాలగూడ ప్రజా లహరి
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్.డి.సి. మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు, నృత్యోత్సవాలు ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ళ రామచంద్రరావు, అధ్యక్షుడు పి. రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి పుల్లాభట్ల వెంకటలక్ష్మి నారాయణ శర్మ లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని మినీరవీంద్ర భారతి ఆడిటోరియం వద్ద ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలతోపాటు ప్రతిభ కనబరిచిన కళాకారులకు నందిని అవార్డ్స్ 2026 అందజేయనున్నామని తెలిపారు.
ఈనెల 9వ తేదీ (సోమవారం) రోజున ఉదయం 10 గంటలకు నృత్యోత్సవాలు, మధ్యాహ్నం 3 గంటలకు కళ్యాణ మండోదరి పద్య నాటకం మహబూబ్ నగర్ జిల్లా నవజ్యోతి కళామండలి జడ్చర్ల వారిచే ప్రదర్శించ బడుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు సభప్రారంభంతడకమళ్ళ రామచంద్రరావు రచించిన నాటకాల అవిష్కరణ, రాత్రి 7 గంటలకు త్యాగ శ్యామ-దీక్షతార్ ఆరాధన సప్తహంలో భాగంగా ఎన్.సి.ఆర్ సంగీత పరిషత్ ద్వారా సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
ఈనెల 10న ఉదయం 10 గంటలకు నృత్యోత్సవాలు, మధ్యాహ్నం 2:30 గంటలకు “శివలీలలు” పద్య నాటకం, కడప
జిల్లా పొద్దుటూరు శ్రీ వెంకటసాయి వెలుగు కళాకారుల సమాజం వారిచే నాటిక ప్రదర్శన అనంతరం సాయంత్రం 5 గంటలకు “ఎవరు” సాంఘిక నాటిక గుంటూరు జిల్లా తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ వారిచే ప్రదర్శించబడుతుందన్నారు. సాయంత్రం 6 :30 గంటలకు “తరమెల్లి పోతున్నది” సాంఘిక నాటిక గుంటూరు జిల్లా శ్రీ కరుణం సురేష్ మెమోరియల్ థియేటర్ వారిచే, రాత్రి 8 గంటలకు “ఇంద్రప్రస్థం” సాంఘిక నాటిక గుంటూరు జిల్లా అభినయ ఆర్ట్స్ వారిచే ప్రదర్శించబడుతుందన్నారు.
ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు పాటల పోటీలు మధ్యాహ్నం 3:00 గంటలకు “భక్త ప్రహ్లాద” పద్యం నాటిక హైదరాబాద్ నవక్రాంతి కల్చర్ అసోసియేషన్ వారిచే నాటక ప్రదర్శన…సాయంత్రం 6 గంటలకు “ఉరి” సాంఘిక నాటిక వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు వారిచే నాటక ప్రదర్శన, రాత్రి 7:15 గంటలకు “వేదాంతం” సాంఘిక నాటిక శ్రీ షిరిడిసాయి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనకాపల్లి వారిచే నాటక ప్రదర్శన, రాత్రి 8:15గంటలకు “తితీక్ష” సాంఘిక నాటిక జీవీకే క్రియేషన్స్ కాకినాడ వారిచే నాటక ప్రదర్శన.
ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు పాటల పోటీలు.. మధ్యాహ్నం 2:00 గంటలకు “చెరిగిపోని చిరునామా” సాంఘిక నాటిక హర్ష క్రియేషన్స్ విజయవాడ వారిచే. మధ్యాహ్నం 3:30 గంటలకు “త్యాగశీలి దధీచి మహర్షి” పద్య నాటకం టి.బి.ఆర్ హైదరాబాద్, రాత్రి 7:00 గంటలకు “నీళ్లు నీళ్లు” సాంఘిక నాటిక నటరాజ డ్రమటిక అసోసియేషన్ పెందుర్తి విశాఖపట్నం. రాత్రి 8:15 గంటలకు “వివాహ బంధం” సాంఘిక నాటిక మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వరంగల్,
ఈనెల 13న ఉదయం 10 గంటలకు నృత్యోత్సవాలు, మధ్యాహ్నం 3 గంటలకు “మోహిని భస్మసురా” పద్య నాటకం అక్కినేని సాంస్కృతిక సమాజం విజయనగరం. సాయంత్రం 6:00 గంటలకు “గేమ్” సాంఘిక నాటిక సిరిమువ్వ కల్చరల్ హైదరాబాద్. సాయంత్రం 7:15 గంటలకు “అమ్మ చెక్కిన బొమ్మ” సాంఘిక నాటిక గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్.
ఈనెల 14 ఉదయం 10 గంటలకు నృత్యోత్సవాలు. మధ్యాహ్నం 3:00 గంటలకు “శ్రీ ఖడ్గ తిక్కన్న” పద్య నాటకం డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ. రాత్రి 7:00 గంటలకు “ఇది కొత్త కథ” సాంఘిక నాటిక డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ.
ఈనెల 15 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు “సై సైరా నరసింహా రెడ్డి” పద్య నాటకం టి.జి.వి కళాక్షేత్రం కర్నూల్. మధ్యాహ్నం 2:30 గంటలకు “యమతిర్పు” సాంఘిక నాటిక రౌతు అప్పలనాయుడు కల్చరల్ ట్రస్ట్ గ్రామం పెద్దమేరంగి, పార్వతీపురం మన్యం’ జిల్లా, మధ్యాహ్నం 3:30 గంటలకు “స్త్రీ సూక్తం” పద్య నాటకం శ్యామలాంబ ఫైనాన్స్ అసోసియేషన్ హైదరాబాద్. రాత్రి 7:00 గంటలకు ముగింపు సభ బహుమతుల ప్రధానోత్సవంతో పాటు నందిని అవార్డ్స్ 2026 ఉత్తమ కళాకారులకు బహుకరించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రేక్షకులు వేలసంఖ్య లో పాల్గొని నాటక, నాటిక పోటీలు జయప్రదం చేయాలని వారు కోరారు.



