అపహరణకు గురైన బంగారంను 24 గంటల్లో రికవరీ చేసిన విజయపురి పోలీసులు… అభినందించిన డిఎస్పి రాజశేఖర్ రాజు

మిర్యాలగూడ క్రైమ్ ప్రజాలహరి..

బంగారపు వస్తువులను భద్రపరుచుటకు SBI బ్యాంకు లోకి వచ్చిన పిర్యాదిరాలు బ్యాగు నుండి బంగారపు వస్తువులు గల కవర్ పడిపోగా అట్టి కవర్ ను తీసుకున్న మహిళను గుర్తించి మొత్తం బంగారపు వస్తువులను రికవరీ చేసిన విజయపురి టౌన్ పోలీసులు కేసులు 24 గంటలు పరిష్కరించడం విజయపురి పోలీసులను డిఎస్పి రాజశేఖర్ రాజు అభినందించారు

 

ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటల సమయములో, శ్రీమతి కొమ్ము రాహేల్ కుమారి నాగార్జునసాగర్ కు చెందినఅనే మహిళ, నాగార్జునసాగర్ లోని పైలాన్ కాలనీ గల SBI బ్యాంక్ నందు తన యొక్క బంగారపు వస్తువులను బద్రపరుచుటకు వెళ్ళి, అక్కడే బంగారపు వస్తువులు గల తన బ్యాగ్ ను పక్కన పెట్టి, నీళ్ళు త్రాగడానికి వెళ్ళి వచ్చేసరికి ఆమె బ్యాగ్ లో గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టిన ప్లాస్టిక్ కవర్ కనిపించలేదు .ఇట్టి విషయంలో ఆదే రోజు రాత్రి ఫిర్యాదు చేయగా, వెంటనే SI విజయపురి టౌన్ కేసు నమోదు చేసి సిబ్బంది బ్యాంక్ వద్ద వున్న CC ఫూటేజ్ ఆదారంగా అట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ గల కవర్ ని తీసుకున్న మహిళను పైలాన్ కాలనీ గా గుర్తించి, సదరు మహిళ నుండి 24 గంటలలోపు గోల్డ్ ఆర్నమెంట్స్ ని రికవరీ చేసి పిర్యాదురాలికి అప్పగించడం జరిగింది.

రికవరీ చేయబడిన గోల్డ్ ఆర్నమెంట్స్ వివరాలు

S No బంగారు ఆభరణాల వివరాలు బరువు

1 బంగారు నల్ల పూసల గొలుసు 2 తులాల & 2 గ్రాములు

2 బంగారు చంద్ర హారం 01 తులం & 06 గ్రాములు

3 బంగారు పుస్తెల త్రాడు 03 తులాలు

4 రెండు ఉంగరాలు 05 గ్రాములు

5 ఆరు జతల చెవి దిద్దులు 14 గ్రాములు

మొత్తము 09 తులాలు.

 

ఇట్టి కేసు మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఆద్వర్యములో B. శ్రీనునాయక్, CI నాగార్జునసాగర్, G. ముత్తయ్య, SI, విజయపురి టౌన్ PS మరియు సిబ్బంది నేరం జరిగిన 24 గంటలలో కేసుని చేదించి, బంగారు ఆభరణాలను రికవరీ చేసినందుకు గాను SP వారిని ప్రత్యేకంగా అభినదించారు.

You May Have Missed