గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి మండలాలలో నిర్వహించిన”గ్రామపంచాయతీ అభివృద్ధి మరియు సామర్థ్య వృద్ధి” కార్యక్రమాలపై జరిగిన మండల ప్రజా పరిషత్ సమీక్షా సమావేశాలలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి BLR పాల్గొన్నారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామపంచాయతీలు గ్రామాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలవాలంటే అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు… గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలకు మెరుగైన సేవలందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు…ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు గ్రామపంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు…ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సూచించారు…ఈ సమీక్షా సమావేశాల్లో MLC శంకర్ నాయక్ , సంబంధిత మండలాల ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Previous post

వేములపల్లి మండల కేంద్రంలో ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR భూమిపూజ

Next post

తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి

You May Have Missed