వేములపల్లి మండల కేంద్రంలో ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR భూమిపూజ

ప్రజాలహరి వేములపల్లి ;మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ గోదాం నిర్మాణ పనులను ఈరోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ నిర్వహించి అధికారికంగా ప్రారంభించారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన వేములపల్లి మండలంలో ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం ఏర్పాటు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు…పంటలను శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచే సౌకర్యం కల్పించడం ద్వారా నిల్వ నష్టాలు తగ్గడమే కాకుండా, రైతులు తమ ధాన్యాన్ని నాణ్యతతో నిల్వ ఉంచుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు…‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక నిల్వ సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు ఆదేశించారు…ఈ కార్యక్రమంలో సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు..

Previous post

సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో క్లాస్‌రూమ్ ఫర్నిచర్, క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

Next post

గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

You May Have Missed