సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో క్లాస్‌రూమ్ ఫర్నిచర్, క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల లో రోటరీ క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్లాస్‌రూమ్ ఫర్నిచర్ మరియు స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి-BLR ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, క్రీడా అవకాశాలు కల్పించడం వారి సమగ్ర అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు… పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడంలో ఫర్నిచర్, క్రీడా సామగ్రి వంటి సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ మిర్యాలగూడ నిరంతరం ముందుండి సేవలందించడం అభినందనీయమని కొనియాడారు… విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములై ముందుకు రావడం సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలు , కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ , పట్టణ అధ్యక్షులు మోయిజ్ , కోడిరెక్క ఇంద్ర కుమార్ , కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు,మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు…

Previous post

మాతృ వియోగంతో బాధలో ఉన్న ఎండి. మోషిన్ అలీ కుటుంబాన్ని పరామర్శించిన నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి, నల్లమోతు సిద్ధార్థ

Next post

వేములపల్లి మండల కేంద్రంలో ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR భూమిపూజ

You May Have Missed