తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి
తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.
ప్రజాలహరి మిర్యాలగూడ;ఈ సందర్భంగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ , వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి గుడిపాటి శిరీష నవీన్ , వివిధ రాజకీయ పార్టీల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, ఆలోచనలు, ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.



