ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతిని ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పిన విజయసింహ రెడ్డి

ప్రజల హరి మిర్యాలగూడ;మిర్యాలగూడ టౌన్ రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, ఉద్యమానికి ఇచ్చిన దిశానిర్దేశం ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడిగా జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. యువత జయశంకర్ సార్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, జొన్నలగడ్డ రంగారెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, చౌగాని బిక్షం గౌడ్, అమరావతి సైదులు, ఎండి మగ్ధూం పాషా, పెద్ది శ్రీనివాస్ గౌడ్ ,ఎండి. మజీద్ ,పాలుట్ట బాబయ్య, ఆంగోతు హాతిరాం నాయక్, ఎండి. షోయబ్ ,ఎర్రమళ్ళ దినేష్ ,ధనావత్ బాలాజీ నాయక్, శిరసనగండ్ల ఈశ్వర చారి, పిసీకే ప్రసాద్, పెండ్యాల పద్మ, ధూళిపాల కళావతి, కోదాటి రమ, పిండబోయిన శ్రీనివాస్ యాదవ్, పందిరి వేణు, నూనె రవికుమార్, చిమట వెంకట రాములు, పేరాల కృపాకర్ రావు, సాయన్న ,పూనాటి లక్ష్మీనారాయణ, చిరుమామిళ్ల వేణుగోపాలరావు, జంజిరాల నాగరాజు, దోనేటి సైదులు, బంటు దుర్గయ్య, ఏలుగుబేళ్లి నాగరాజు, సాదినేని శ్రీనివాసరావు, పున్న రాములు, మన్నెం శ్రీనివాసరెడ్డి, బల్లెo ఆయోద్య, రమావత్ వినోద్ నాయక్ ,మండల సైదాచారి, పల్లా బిక్షం, షేక్ ఫయాజ్, నేరెళ్ల శివ, ఏనుగంటి తిరుపతిరావు , దైదవెంకటేష్, మాలావత్ రవీందర్ నాయక్, ఐల వెంకన్న గౌడ్, నాగయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆచార్య జయశంకర్ సార్కు ఘన నివాళులర్పించారు.

You May Have Missed