ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయము.ఎల్ఐసి శంకర్ నాయక్, ఎమ్మెల్యే బిఎల్ఆర్

వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలోని జరిగినటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయం మండల ఎంపీడీవో జితేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ ప్రభుత్వమే దేయమని వారన్నారు, గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సదానందం పేద ప్రజల కోసం వివిధ రకాలు సంక్షేమ పథకాలు అమలు చేసింది ముఖ్యంగా రానున్న రోజుల్లో ప్రజల అభివృద్ధి కోసం మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్టుగా వారు తెలిపారు, అంతే కాకుండా గ్రామాల్లోని సర్పంచులు సంబంధిత గ్రామ వార్డు సభ్యులు పంచాయతీ సెక్రెటరీ పరిపాలన అధికారులకు సమన్వయంగా పనిచేస్తూ ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వార్డు సభ్యులతో కలిసి పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని వారన్నారు, ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Previous post

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 92వ జయంతిని ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పిన విజయసింహ రెడ్డి

Next post

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీ వాసుల పాలిట అపర భగీరధుడు రాంబాబు; ఏనుగుల రాకేష్ రెడ్డి

You May Have Missed