మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీ వాసుల పాలిట అపర భగీరధుడు రాంబాబు; ఏనుగుల రాకేష్ రెడ్డి
ప్రజాలహరి మిర్యాలగూడ;6వ వార్డు ఇందిరమ్మ కాలనీ కి చెందిన నివాసులకు ఇంటి పట్టాలను పంపిణీ చేసిన MLC అభ్యర్థి శ్రీ. ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మరియు BRS రాష్ట్ర నాయకులు శ్రీ. నల్లమోతు సిద్ధార్థ గారు _ 18 సంవత్సరాల సమస్యకు స్వస్థి పలికించిన ఇందిరమ్మ కాలనీ మన రాంబాబు.. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న కాలనీ వాసుల ఇంటి పట్టాలను తెప్పించారు..
ఇందిరమ్మ కాలనీలో పెండింగ్లో ఉన్న ఇంటి పట్టాల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు.లబ్ధిదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయం చేసినట్లు పేర్కొన్నారు. సమస్యను తెలుసుకున్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారానికి కృషి చేశారు. మాజీ MLA గౌరవ శ్రీ . నల్లమోతు భాస్కర్ రావు గారి సహకారంతో… MLC అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, BRS రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ ల చేతుల మీదుగా ఒరిజినల్ ఇంటి పట్టాలను అందజేశారు_. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు భూక్య రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని భూక్య రాంబాబు తెలిపారు. ఇందిరమ్మ కాలనీ మన రాంబాబు📱9000 527 827నంబర్ కు కాల్ చేయాలని ఆయన సూచించారు

