సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్

*మిర్యాలగూడలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు*

మిర్యాలగూడ ప్రజాలహరి

ఈరోజు అల్ ఇండియా బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆరాధ్య దైవం *శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి* ఉత్సవాలలో పాల్గొన్న

 

శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*..

 

MLC *శంకర్ నాయక్ గారు,*

 

సబ్ కలెక్టర్ *అమిత్ నారాయణ గారు*,

మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా బాలు గారు*,

 

వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష నవీన్ గారు*,

 

గిరిజన నాయకులు, కమిటీ సభ్యులు.. మిర్యాలగూడ MPDO కార్యాలయం నుండి మొదలై బంజారా భవన్ వరకు సేవాలాల్ మహారాజ్ స్వామి ఉత్సవ ర్యాలీ నిర్వహించారు…..

 

అనంతరం బంజారా భవన్ నందు గిరిజన సంప్రదాయ బద్దంగా భోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజల .. అనంతరం మినీ రవీంద్ర భారతి నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..

 

ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ

 

గోర్ బంజారా సమాజానికి నిజమైన దైవం, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు సంత్ సేవాలాల్ మహారాజ్… 18వ శతాబ్దంలోనే బంజారాల సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎనలేని కృషి చేసారన్నారు..

 

కర్ణాటకలో జన్మించిన సేవాలాల్ గారు, అహింస, శాకాహారం, ధర్మం, మరియు క్రమశిక్షణను పాటించాలని బోధించారు… మతమార్పిడులను, మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు…

 

సేవాలాల్ మహారాజ్ కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఒక గొప్ప దార్శనికుడు. భవిష్యత్తులో వాహనాల వాడకం (ఎడ్లు లేని బండ్లు), నీటి ఎద్దడి గురించి ఆయన ఆనాడే చెప్పారు…అంత ముందు చూపు కలిగిన మహా జ్ఞానీ వారు అని అన్నారు..

 

“సేవాలాల్ మహారాజ్ మనకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించారు. ఆయన తండాల అభివృద్ధికి, విద్యకు, స్త్రీల గౌరవానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు అని అన్నారు..

 

“సేవాలాల్ మహారాజ్ చూపిన అహింసా మార్గంలో నడుస్తూ, బంజారా సమాజం విద్యావంతంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంతో ముందడుగు వేయాలి. ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అని అన్నారు..

 

*నేను గిరిజన జాతికి చెందిన బిడ్డను కాకపోయినా మిర్యాలగూడ గిరిజన సోదర సోదరిమణులు అందరూ నన్ను వారి సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ నాతో పాటు నడిచి ఈరోజు నన్ను ఈ శాసనసభ్యుడిగా మీ ముందు నిలబెట్టారు… వారి ఋణం నేను ఇప్పటికి మరచిపోను వారికి వారి కుటుంబాలకు, నా ఊపిరి ఉన్నంతవరకు అండగా ఉంటానాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని అన్నారు..*

 

*ప్రజా ప్రభుత్వం లో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు.. మన గిరిజన నాయకుడు శంకర్ నాయక్ గారికి MLC తో పాటు, కాంగ్రెస్ పార్టీ ఆదివాసి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి గిరిజనులను గౌరవించింది అని అన్నారు..*

 

ఈరోజు మీ ఆరాధ్య దైవం మాత్రమే కాదు నాకు కూడా ఆరాధ్య దైవం ఐనటువంటి సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి వేడుకలు మీ అందరితో కలిసి జరుపుకుంటునందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు..

 

అనంతరం గిరిజన నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేసారు..

 

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గం గిరిజన నాయకులు, గిరిజన ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

You May Have Missed